నీరవ్‌ ఆస్తుల జప్తు

నీరవ్‌ ఆస్తుల జప్తు

దిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ను మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన మరికొన్ని ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ముంబయి, సూరత్లోని నీరవ్ ఆస్తులను మనీలాండరింగ్ చట్టం కింద జప్తు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాటిలో ఎనిమిది ఖరీదైన కార్లు, మెషినరీ, ఆభరణాలు, పెయింటింగ్స్తో పాటు కొన్ని స్థిరాస్తులు కూడా ఉన్నాయి. వీటి మార్కెట్ విలువ రూ.147.72కోట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నీరవ్ మోదీ గ్రూప్కు చెందిన ఫైర్స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, ఫైర్స్టార్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, రాధీషిర్ జ్యూయలరీ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, రిథమ్ హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. భారత్, విదేశాల్లో ఉన్న నీరవ్కు చెందిన రూ.1,725.36 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటి వరకు ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాపర్టీలు కాకుండా గతంలో ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం, వజ్ర, ఆభరణాలు తదితర విలువైన వస్తువుల విలువ మొత్తం రూ.489.75కోట్లు ఉంటాయి. పీఎన్బీ కేసులో నీరవ్తో పాటు మోహుల్ ఛోక్సీ మరో నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటి వరకు వీరిద్దరికి చెందిన దాదాపు రూ.4,765 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos