కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు…

పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్‌-పాక్‌ల మధ్య పరిస్థితులు రోజురోజుకు
ఉద్రిక్తకరంగా మారుతున్నాయి.పుల్వామా దాడిపై పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌తో
పాటు మాజీ అధ్యక్షులు,పాక్‌ సైన్యం,చివరకు విలేకరులు కూడా భారత్‌పై విషం చిమ్ముతూ నక్కబుద్ధిని
ప్రదర్శిస్తున్నారు.మరోవైపు పాక్‌ సైన్యం సరిహద్దుల్లో ప్రతీరోజూ కాల్పులకు తెగబడుతుండడంతో
పాకిస్థాన్‌కు దిమ్మదిరిగే రీతిలో సమాధానమివ్వడానికి భారత ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.అందుకోసం
యుద్ధమొకటే మార్గంగా భావించిన ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉండాలంటూ భారత సైన్యానికి
ఆదేశాలు జారీ చేయడంతో అప్రమత్తమైన సైన్యం సరిహద్దుల్లో భారీగా జవాన్లను మొహరిస్తోంది.పది
రోజులకు సరిపడే విధంగా మందుగుండు సామాగ్రి,యుద్ధ ట్యాంకులతో పాటు 100 కంపెనీల సైనికులు
కశ్మీర్‌కు చేరుకున్నారు.అదనంగా మరో 100 కంపెనీల సైనికులు మరికొద్ది రోజుల్లో సరిహద్దుకు
చేరుకోనున్నట్లు సమాచారం.వారిని వీలైనంత త్వ‌ర‌గా ఇక్క‌డ‌కు చేర్చేందుకు వాయుమార్గంలో
అన్ని ఏర్పాట్లు తీసుకున్నారు. సుమారు 40 గ్రామాల్లో ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు
త‌ర‌లించారు. కొన్నిచోట్ల బంక‌ర్ల‌ను త‌వ్వారు. క్షిప‌ణులు ప్ర‌యోగించిన‌పుడు ఎలా ఉండాలి.
ఏ విధంగా దాడుల నుంచి బ‌య‌ట‌ప‌డాల‌నే అంశాల‌పై గ్రామాల్లో సైన్యం అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న‌ట్టు
తెలుస్తోంది. పాక్ మాజీ సైన్యాధికారి జ‌న‌ర‌ల్ ముష్రాప్ తాజాగా ఇరుదేశాల యుద్దం గురించి
సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.భారత్‌పై అణుదాడి చేసిన అనంతరం భారత్‌ నుంచి వచ్చే ప్రతిఘటనను
ఎదుర్కోవడం అసాధ్యమని పాకిస్థాన్‌ ఒక్క అణుబాంబు వేస్తే భారత్‌ 20 అణుబాంబులు వేస్తుందని
దీన్నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే పాకిస్తాన్ భార‌త్‌పై ఏక‌కాలంలో 50 అణుబాంబులు ప్ర‌యోగించాలంటూ
సూచ‌న కూడా చేశాడు. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కూడా భార‌త్ ఏదో చేస్తోందంటూ
ఆందోళ‌న వెలిబుచ్చాడు. ఇజ్రాయేల్‌, ర‌ష్యాలు భార‌త్‌లో జ‌రుగుతున్న ప‌రిణామాలు తాము
అందించాల్సిన సాయంపై కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాయ‌ట‌.ఇప్ప‌టికే వాణిజ్య యుద్ధం, జ‌ల
నిర్బంధంతో క‌కావిక‌ల‌మైన పాకిస్తాన్, చైనావైపు సాయం కోసం చూస్తున్న‌ట్టు తెలుస్తోంది.
చైనాకు అందివ‌చ్చిన అవ‌కాశం కావ‌టంతో భార‌త్‌పై టిబెట్‌ను సాకుగా చూపుతూ దాడికి దిగే
అవ‌కాశాలున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. చైనా, పాకిస్తాన్‌తో ఏక‌కాలంలో యుద్ధం చేయాల్సి
వ‌స్తే భార‌త్ ఎలా స్పందించాల‌నే దానిపై త్రివిద ద‌ళాలు స‌న్న‌ద్ధ‌త‌ను ప‌రిశీలించుకుంటున్నట్టు
స‌మాచారం.మరోవైపు భారత్‌పై దాడికి పాల్పడితే భారత్‌కు మద్దతుగా ఎటువంటి క్షిపణులైనా
ప్రయోగించడానికి తాము వెనుకాడబోమంటూ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ చేసిన హెచ్చరికలు
ప్రపంచ దేశాలను ముఖ్యంగా పాకిస్థాన్‌,చైనా దేశాలను మరింత ఆందోళనకు గురి చేస్తోంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos