రాజకీయాల్లో రావడానికి తెగ ఆసక్తి చూపుతున్న స్టార్ కమెడియన్ అలీకి
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వనున్నట్లు
వార్తలు ఊపందుకున్నాయి.మొదటి నుంచి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చాలా వరకు మైనారిటీ
వర్గానికి చెందిన నేతలు గెలుస్తూ వస్తున్నారు.దీంతోపాటు ఈ నియోజకవర్గంలో తెదేపాకు మొదటి
నుంచి మంటి పట్టు ఉంది.తెదేపా నుంచి జియావుద్దీన్ అప్పటి కాంగ్రెస్ నేత మహ్మద్‌జానీపై
రెండుసార్లు భారీ మెజారిటీతో గెలిచారు.అయితే 2004వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో వైఎస్‌ఆర్
నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ సృష్టించిన ప్రభంజనంలో తెదేపా గుంటూరు తూర్పు నియోజకవర్గంపై
పట్టు కోల్పోయింది.2009లో కూడా తెదేపా తరపున బరిలో దిగిన జియావుద్దీన్ ఓటమిపాలు కావడంతో
2014లో జియావుద్దీన్‌కు బద్లు మద్దాలి గిరిధర్‌కు టికెట్ ఇచ్చింది.అయితే వైసీపీ తరపున
బరిలో దిగిన మహ్మద్ ముస్తఫా తెదేపా అభ్యర్థి గిరిధర్‌పై విజయం సాధించడంతో ఈ నియోజకవర్గంలో
గెలుపోటములు నిర్దేశించేది మైనారిటీలేనని గుర్తించారు.ఈ క్రమంలో తనకు మంత్రి పదవి ఇస్తామని
హామీ ఇచ్చే పార్టీలో చేరతానంటూ అలీ ప్రకటించిన నేపథ్యంలో అలీని గుంటూరు తూర్పు నియోజకవర్గం
నుంచి అభ్యర్థిగా బరిలో దింపడానికి తెదేపా అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం.గుంటూరు
తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా అలీని దాదాపుగా ఖరారు చేసినట్లేనని తెలుస్తోంది..