బాదం పప్పు శరీరానికి అవసరమైన పోషకాలనే కాదు, పలు వ్యాధుల నిరోధకంగా కూడా పని చేస్తుంది. వీటిలో ఖనిజాలు కూడా విరివిగా ఉన్నాయి. శరీరంలోని వ్యర్థ పదార్థాలను కూడా ఇది వెలుపలకు పంపిస్తుంది. దీనిలోని విటమిన్ యాంటీయాక్సిడెంట్లా పని చేస్తుంది. రోజూ ఏడు గ్రాముల బాదం తింటే ఎల్డీఎల్ అనే కొవ్వు 15 శాతం వరకు తగ్గుతుంది. ఆరు గ్రాముల చొప్పున బాదం తీసుకుంటే దంతాలు, ఎముకలు మరింత పటిష్టమవుతాయి. రోజుకు పది బాదం పప్పుల చొప్పున వారానికి అయిదు సార్లు తీసుకుంటే హృద్రోగ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అలసటగా ఉన్నప్పుడు నాలుగైదు పప్పులు తీసుకుంటే సత్వర శక్తి చేకూరుతుంది. రోజుకు అయిదు చొప్పున బాదం పప్పులు తీసుకుని, బాగా నీరు తాగితే మలబద్ధకం పోతుంది. మధుమేహం ఉన్న వారు భోజనం తర్వాత కొన్ని బాదం పప్పులు తింటే రక్తంలోని ఇన్సులిన్ శాతం పెరుగుతుంది. రోజూ మూడు బాదం గింజలను నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం పొట్టు తీసి పిల్లలకు తినిపిస్తే వారిలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పేగు కేన్సర్‌ను కూడా బాదం దూరం చేస్తుంది. రోజుకు 23 బాదం పప్పులు తింటే అనేక రకాల వ్యాధులకు దూరంగా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు.