జొమాటో నుంచి జారిన వేల హోటళ్ళు

జొమాటో నుంచి జారిన వేల హోటళ్ళు

ముంబయి: తమ జాబితా నుంచి ఫిబ్రవరిలో దాదాపు 5,000 హోటళ్లను
తొలగించినట్లు ఆహార సరఫరా సంస్థ జొమాటో శనివారం ఇక్కడ  వెల్లడించింది. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిబంధనల ప్రకారం హోటళ్లు నాణ్యత
ప్రమాణాల్నిపాటించనందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వివరించారు. 150 పట్టణాల్లో తమతో ఒప్పందం చేసుకొన్న సంస్థల్లో నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేస్తామని తెలిపింది.
‘ ప్రతి
రోజూ మా జాబితాలోకి  కొత్తగా నాలుగు వందల  రెస్టారెంట్లు చేరుతున్నాయి. వీటి నాణ్యతా ప్రమాణాలను పరిశీలించడం కీలకం. మాతో అనుబంధం ఉన్న దాదాపు 80,000 రెస్టారెంట్లను మరోసారి పరిశీలించి అవి నాణ్యతా ప్రమాణాలను అందుకొనేందుకు సాయం చేస్తాం’ అని జొమాటో సీఈవో మోహిత్‌ గుప్తా వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos