అస్సాం రైఫిల్స్ ప్రత్యేక అధికారాలపై వేటు

అస్సాం రైఫిల్స్ ప్రత్యేక అధికారాలపై వేటు

దిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం రైఫిల్స్‌కు ప్రత్యేక అధికారాల్ని
కట్టబెట్టిన ఉత్తర్వులకు కేంద్రం శనివారం మంగళం పాడింది. అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌, మణిపూర్‌, నాగాలాండ్‌, మిజోరం సరిహద్దులుగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కడైనా, ఎప్పుడైనా వారెంటు లేకుండానే అరెస్టులుగానీ, సోదాలుగానీ చేపచేట్టి
అధికారాన్ని ఆ బలగాలకు దఖలు పరిచే ఆ ఉత్తర్వును ఈశాన్యరాష్ట్రాల ప్రజానీకం తీవ్రకంగా
నిరసించినట్లు నిఘా విభాగాలు తెలపటంతో కేంద్రం ఆ నిర్ణయాన్ని తీసుకుంది. ఆయారాష్ట్రాలతో క్షుణ్నంగా చర్చించిన తరవాత  తుది నిర్ణయాన్ని తీసుకుంటామని హోం శాఖ తెలిపింది. పౌరసత్వ సవరణ ముసాయిదా
ఇప్పటికే ఈశాన్యంలో తీవ్ర ఆందోళనలు రేకేత్తించటం తెలిసిందే. భారత్‌ -మయన్మార్‌ సరిహద్దులో అక్రమ చొరబాట్లను నిలువరించే
 గస్తీ అస్సాం రైఫిల్స్‌ నిర్వహిస్తున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos