గాజుగ్లాసుతో జాగ్రత్త పగిలితే పీకలు కోస్తుంది…

  • In Film
  • February 23, 2019
  • 208 Views

మై ఛానల్‌ నా ఇష్టం పేరుతో మెగాబద్రర్‌ నాగబాబు చేస్తున్న వీడియోలు
రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. గతంలో అధికార తెలుగుదేశం పార్టీపై ముఖ్యంగా బాలకృష్ణ,నారా
లోకేశ్‌పై నాగబాబు చేసిన వీడియోలు ఎంత సంచలనం సృష్టించాయో ప్రతీ ఒక్కరికే తెలిసిన విషయమే.తన
ఛానల్‌ ద్వారా తన తమ్ముడు,జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌పై విమర్శలు చేస్తున్న
పార్టీలపై,వ్యక్తులపై ఛానల్‌ ద్వారా విరుచుకుపడుతున్న నాగబాబు తాజాగా తన తమ్ముడిపై
ఆర్టికల్‌ రాసిన ఓ మీడియాపై నాగబాబు విరుచుకుపడ్డారు.సదరు మీడియాను ఉటంకిస్తూ హిట్లర్ -గోబెల్స్ పిట్ట కథను చెబుతూ పవన్ కళ్యాణ్ పార్టీ టీడీపీలో విలీనం అంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నవారికి వార్నింగ్ ఇచ్చారు.రెండవ
ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్‌ తన రాక్షసత్వ పాలనను కాపాడుకునేందుకు గోబెల్స్‌ అనే మంత్రి
ద్వారా తానొక గొప్పవాడిననే వార్తలు ప్రచారం చేయించేకునేవాడన్నారు.ఇపుడు ఆంధ్రప్రదేశ్‌లో
రాజకీయ పార్టీలు కూడా గోబెల్స్‌ తరహాలో మీడియాలు,పత్రికలు ఏర్పాటు చేసుకొని తమను తాము
గొప్పవాళ్లుగా ప్రచారం చేయించుకుంటూ పవన్‌పై తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.అప్పట్లో
గోబెల్స్‌ మినహా మరొక ప్రత్యామ్నాయ మీడియా లేకపోవడంతో హిట్లర్‌ ఆటలు సాగాయని కానీ ప్రస్తుతం
ప్రసార మాధ్యమాలు,పత్రికలను మించిన ఆయుధం సామాజిక మాధ్యమాలు ఉన్నాయని ఎంతతొక్కాలని
చూస్తే అంతకు రెండింతలు తమపై తప్పుడు వార్తలు ప్రచారం చేసే వ్యక్తులకు సమాధానం చెప్పడానికి
జనసైనికులు సిద్ధంగా ఉన్నారన్నారు.పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసిపోయామని వైసీపీ వాళ్లు.. వైసీపీతో కలిశాడని టీడీపీ వాళ్లు.. కొందరేమో బీజేపీతో కలిశాడంటున్నారని.. పవన్ అంత ఓపెన్ గా తాను ఒంటరిగా పోటీచేస్తానని చెప్పినా వాళ్లకు సెన్స్ లేకుండా తప్పుడు ప్రచారం చేస్తారని నాగబాబు మండిపడ్డారు. మాఫియాల పేరుతో దోచుకునే వ్యక్తి పవన్ కాదని.. జెన్యూన్ గా ప్రభుత్వాన్ని ప్రజలకు అందించాలని ముందుకొస్తున్నాడని నాగబాబు కొనియాడారు.ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గుర్తు ‘గాజు గ్లాస్’పై కూడా నాగబాబు హాట్ కామెంట్ చేశారు. గాజు గ్లాస్ నీల్లు తాగడానికి ఉపయోగపడుతుందని.. అదే సమయంలో పగిలిపోతే పీకలు కూడా కోస్తుందని ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశారు. గాజు గ్లాస్ కు అధికార,ప్రతిపక్షం అనే ఆలోచన దానికి ఉండదని.. గ్లాసుని పగలకొట్టాలని చూసినా.. పగిలినా ఆ గాజు పెంక ఆయుధంగా మారి పీకలు కోస్తుంది బీ కేర్ ఫుల్ అంటూ నాగబాబు హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos