
బాల నటుడిగా సినీ కెరీర్ మొదలుపెట్టిన బాలకృష్ణ ఈ నలభైఏళ్ల సినీకెరీర్‌లో
ఇంతటి ఘోర పరాభవాన్ని ఎప్పుడూ చూసి ఉండరేమో అన్నంతగా శుక్రవారం విడుదల చేసిన ఎన్టీఆర్
మహానాయకుడు సినిమా దారుణమైన ఓపెనింగ్స్‌ను నమోదు చేసుకుంది.తెలుగు చిత్ర పరిశ్రమలో
భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న అగ్రహీరోల్లో ఒకరైన బాలకృష్ణ నటించిన సినిమా ఇంతటి దారుణమైన
వసూళ్లు నమోదు చేసుకోవడం బాలకృష్ణ అభిమానులకు మింగుడు పడడం లేదు.నాగార్జున
హీరోగా వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన డిజాస్టర్ ఆఫీసర్ కూడా మహానాయకుడి కంటే మెరుగైన
వసూళ్లు రాబట్టింది. ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రం ఆర్ టీసీ క్రాస్ రోడ్స్ లో 1.6 లక్షలను వసూళ్లు చేయడం పరిస్థితికి అర్థం పడుతోంది. వర్మ ‘ఆఫీసర్’ చిత్రం అదే ఆర్ టీసీ క్రాస్ రోడ్డులో మొదటి రోజు 3.44 లక్షలను వసూళ్లు చేసింది. వర్మ ‘ఆఫీసర్’ చిత్రంపై అంచనాలు లేకుండానే ఆ వసూళ్లు రాబట్టింది.ఇదొక్కటే
కాదు ఇంకా ఎన్నో చిన్న చెత్త సినిమాలు కూడా కోటికి మించి వసూళ్లను రాబట్టాయి. కాని ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ మాత్రం దారుణమైన ఓపెనింగ్స్ ను నమోదు చేయడంతో యూనిట్ సభ్యులు కూడా అవాక్కవుతున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడు విడుదల టైమ్ లో కాస్తూకూస్తో హైప్ ఉంది. పైగా పండగ సీజన్. కాబట్టి ఆ సినిమాకు ఓ మాదిరిగా ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ మహానాయకుడు విషయంలో మాత్రం సీన్ మారిపోయింది. పార్ట్-1 డిజాస్టర్ అవ్వడంతో పాటు బాక్సాఫీస్ కు ఇది అన్-సీజన్ కావడంతో మహానాయకుడు ఓపెనింగ్స్ మహా ఘోరంగా వచ్చాయి.మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. శని ఆదివారాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం బాలయ్య సినీ కెరీర్ లోనే ఇదో పెద్ద డిజాస్టర్ గా నిలవడం ఖాయం అంటూ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంపై చిత్ర యూనిట్ సభ్యులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కాని కలెక్షన్స్ మాత్రం తీవ్ర నిరాశను కలిగిస్తున్నాయి. కథానాయకుడు తరహాలోనే మహానాయకుడు కలెక్షన్స్ ఉన్న నేపథ్యంలో బాలకృష్ణ కు తీవ్ర నష్టాలు తప్పవని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.