ఉగ్రవాదులపై ఉక్కు పాదం

శ్రీ నగర్‌: కశ్మీర్‌ లోయలోని వేర్పాటువాదులపై ఉక్కుపాదాన్ని
మోపేందుకు ప్రభుత్వం రంగాన్ని సిద్దం చేసింది. గత రాత్రి దాదాపు 100 కంపెనీల పారా మిలటరీ దళాలు  శ్రీనగర్‌కు విమానాల
ద్వారా చేరుకున్నాయి. వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌ను
శుక్రవారం  అరెస్టు చేయడంతో అధికార
యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది పుల్వామ దాడి తర్వాత జమ్ము-కశ్మీర్‌లో ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. తర్వాత సంభవించిన ఎదురు కాల్పుల్లో  పుల్వామ ఉగ్రదాడి  సూత్రధారిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వేర్పాటు వాద నేతలు ప్రజలను రెచ్చగొడుతుండటంపై  ప్రభుత్వం దృష్టి సారించింది. పలువురు జమాత్‌ ఇస్లాం ప్రముఖులు,, కీలక నేత అబ్దుల్‌ హమీద్‌ ఫయాజ్‌ను శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos