రంభ,రాశిలకు ఘాటు హెచ్చరిక…

  • In Film
  • February 23, 2019
  • 192 Views
రంభ,రాశిలకు ఘాటు హెచ్చరిక…

మా క్రీమ్‌ వాడితే నెల రోజుల్లో తళతళ మెరిసిపోతారు,మా పర్‌ఫ్యూమ్‌
రాసుకుంటే అమ్మాయిలు వచ్చి ఒళ్లో వాలిపోతారు మా దగ్గర ట్రీట్‌మెంట్‌ తీసుకుంటే నెలరోజుల్లో
నాలా నాజూగ్గా తయారవుతారు ఇటువంటి ప్రకటనలు చూసి మోసపోవడం ప్రజలకు నిత్యకృత్యలయ్యాయి.తమ
ఉత్పత్తులను,తమ వ్యాపారాన్ని విస్తరింపచేయడానికి ఆయా సంస్థలు ప్రముఖ హీరోహీరోయిన్లు,క్రికెటర్లతో
పాటు సినిమా రంగానికి చెందిన ప్రముఖులతో వాణిజ్య ప్రకటనలు గుప్పిస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నాయి.దీనిపై
గతంలో హిందీ,తెలుగు చిత్రపరిశ్రమలకు చెందిన ప్రముఖులు వివాదాలు కూడా ఎదుర్కొన్నారు.అయినప్పటికీ
వారిలో ఎటువంటి మార్పు వచ్చినట్లు కనిపించడం లేదని తాజాగా జరిగిన ఘటన రుజువు చేస్తోంది.బరువు
తగ్గడం కోసం ద్వితీయ శ్రేణి నగరాల నుంచి ప్రముఖ నగరాల్లో కోకొల్లలుగా వెలసిన వెయిట్‌లాస్‌
క్లినిక్‌లలో ఒకటి కలర్స్ వెయిట్ లాస్ క్లినిక్.
ఈ కలర్స్ వారు ఇచ్చే కలర్ఫుల్ యాడ్స్ లో రంభ.. రాశి కన్పిస్తారు. అప్పట్లో ఎంత బొద్దుగా ఉన్నాము .. ఇప్పుడు ఎంత నాజూగ్గా ఉన్నామో చెప్తూ ‘మీరు చేరండి..నాజూగ్గా మారండి’ అంటూ ఉంటారు.  ఈ ముద్దుగుమ్మల మాటలు విని చాలామంది ఆ క్లినిక్ లో చేరతారు. అలానే విజయవాడకు చెందన ఒక వ్యక్తి దాదాపుగా రూ. 75000 కట్టి వెయిట్ లాస్ ట్రీట్మెంట్ తీసుకున్నాడట. కానీ ఫలితం లేకపోవడంతో వినియోగదారుల
న్యాయస్థానాన్ని ఆశ్రయించి కలర్స్ క్లీనిక్ పై ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా టీవీ చానల్స్ లో తప్పుదారి పట్టించేలా ఉన్న కలర్స్ వారి ప్రకటనలను ఆపాలని కోర్టువారిని కోరారు.  ఫిర్యాదులో నిజానిజాలు పరిశీలించిన కోర్టువారు ఆయన కట్టిన ఫీజు మొత్తాన్ని తిరిగివ్వాలని.. దానితో పాటు 9 % వడ్డీని కూడా కలర్స్ వారు చెల్లించాలని తీర్పునిచ్చారు.   ఈ మొత్తమే కాదు కంప్లైంట్ చేసిన అతనికి అదనంగా రెండు లక్షల రూపాయలు పరిహారంగా చెల్లించాలని తీర్పునిచ్చారు. మరోవైపు కలర్స్ వారి ప్రకటనలను ఏ చానల్స్ వారు ప్రసారం చేయకూడదని కూడా ఆర్డర్ పాస్ చేశారు ఇక రంభ,
రాశి లకు కూడా ఘాటుగానే వార్నింగ్ ఇచ్చారు. మోసపూరితమైన ప్రకటనల్లో పాల్గొని ప్రతిష్ఠ
దిగజార్చుకోకండి అని రంభ, రాశి లకు న్యాయమూర్తి సూచించారు. సెలేబ్రిటిగా ఉన్నప్పుడు
బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్క సెలెబ్రిటీ గుర్తుంచుకోవాలని న్యాయమూర్తి
అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos