దిల్లీ: జమ్ము జైళ్లలో ఉన్న ఏడుగురు పాకిస్థానీ ఖైదీలను, దిల్లీలోని తిహార్ జైలుకు తరలించాలని
జమ్ము-కశ్మీర్ ప్రభుత్వం శుక్రవారం
అత్యున్నత .న్యాయస్థానానికి విన్నవించింది. చెరసాల్లోని ఇతర ఖైదీలనూ
ఆకర్షించే అవకాశం ఉందని పేర్కొంది. దీనికి స్పందించాలని విచారణ
చేపట్టిన న్యాయమూర్తులు జస్టిస్ ఎల్‌ఎన్ రావు, జస్టిస్ ఎం.ఆర్ షాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కేంద్ర,
దిల్లీ ప్రభుత్వాల్ని
ఆదేశించింది. వేర్వేరు సంస్థలకు చెందిన ఉగ్రవాదులు జమ్ము చెరసాల్లో బంధీలుగా ఉన్నారు. ఇతర ఖైదీలకూ ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోసి తమ వైపునకు తిప్పుకొనే అవకాశం ఉన్నందున వారిని తిహార్ జైలుకు తరలించాలని జమ్ము-కశ్మీర్ ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ షోయబ్ అలంఅత్యున్నత న్యాయస్థానాన్ని
కోరింది. తిహార్‌కు తరలించడం సాధ్య పడకపోతే అత్యంత కట్టు దిట్టమైన భద్రత ఉండే హరియాణా, కారాగారాలకైనా పంపాలని విన్నవించారు.