రాఫెల్‌ తీర్పు పునఃసమీక్ష

రాఫెల్‌ తీర్పు పునఃసమీక్ష

న్యూఢిల్లీ:  రాఫేల్ ఒప్పందంపై గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ దాఖలు
చేసిన వ్యాజ్యాల విచారణకు అత్యున్నత న్యాయస్థానం గురువారం సుముఖత వ్యక్తం చేసింది. తక్షణమే విచారణ చేపట్టే అంశాన్ని పరిశీలిస్తా
మని తెలిపింది. ఇందుకు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందని ప్రధాన
న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అన్నారు.‘ఇది కాస్త కష్టమైన పని. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామ’ న్నారు. రాఫేల్‌ ఒప్పందంలో అవకతవకలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం నిరుడు డిసెంబరు 14న తుది తీర్పు వెల్లడించింది. రఫేల్‌ ఒప్పందం ప్రక్రియను సందేహించడానికి ఎలాంటి ప్రాతిపదికా కన్పించలేదని  పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos