దిల్లీ: కేంద్ర సాయుధ పారామిలటరీ దళాలు ఇక దిల్లీ-శ్రీనగర్, శ్రీనగర్-దిల్లీ, జమ్ము-శ్రీనగర్, శ్రీనగర్-జమ్ము మార్గాల్లో విమానాల్లో ప్రయాణించ వచ్చు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గురువారం
ఇందుకు అనుమతి జారీ చేసింది. దీంతో దాదాపు 7,80,000 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బందికి
ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటి వరకు ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ లకు విమాన ప్రయాణాల వెసలుబాటు లేదు. విధి నిర్వహణ
,సెలవు ప్రయాణాల్ని కూడా విమానాల్లో ప్రయాణించ వచ్చు. పైన పేర్కొన్న మార్గాల్లో వైమానిక సేవలను కూడా ప్రభుత్వం క్రమంగా పెంచనుంది. అవసరమైన సహకారాన్ని వాయుసేన నుంచి తీసుకో నున్నారు. పుల్వామా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి పర్యవసానంగా కేంద్రం ఈ
నిర్ణయాన్ని తీసుకుంది.