విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ దందా..

  • In Crime
  • February 21, 2019
  • 213 Views
విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ దందా..

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో డ్రగ్స్ మరోసారి గుప్పుమన్నాయి.
ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా ఈ దందా కొనసాగుతోంది. గతంలో డ్రగ్స్ విక్రయిస్తూ
నైజీరియా, సుడాన్ దేశాలకు చెందిన వారు పట్టుబడగా .. తాజాగా ఘనా దేశానికి చెందిన మహిళ
పోలీసులకు చిక్కింది. హైదరాబాద్ శివారులో ఇంజినీరింగ్ కాలేజీలు చాలా ఉన్నాయి.
ఆ కాలేజీలపై డ్రగ్స్ డెన్స్ ఫోకస్ చేశారు. విద్యార్థులే టార్గెట్ గా అడ్డాలు ఏర్పాటు
చేసుకొని గంజాయి, కొకైన్, బ్రౌన్ షుగర్ విక్రయిస్తున్నారు. దీంతో బంగారు భవిష్యత్తు
ఉన్న విద్యార్థులు మత్తులో చిత్తవుతూ తమ ఫ్యూచర్ ను నాశనం చేసుకుంటున్నారు.
గత కొంతకాలంగా స్థబ్దుగా ఉన్న డ్రగ్స్ విక్రయాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. గురువారం డ్రగ్స్
విక్రయిస్తున్న మహిళను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెది ఘనా దేశమని
వెల్లడించారు. నిందితురాలి నుంచి 50 గ్రాముల కొకైన్ స్వాధీనం చేస్తున్నారు. ఆమె గత
కొంతకాలంగా శివారులో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు
అధికారులు వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos