ప్రియ నన్ను తొక్కేసింది…

  • In Film
  • February 21, 2019
  • 188 Views
ప్రియ నన్ను తొక్కేసింది…

మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లు అసలే ఎన్నో అంచనాల మధ్య ప్రేమికుల
రోజు విడుదలైన ఒరు అడార్‌ లవ్‌ చిత్రం దారుణ పరాజయం కావడంతో సినిమా కెరీర్‌ గురించి
ఆందోళనలో ఉన్న ప్రియ ప్రకాశ్‌ వారియర్‌కు మరింత నష్టం వాటిల్లేలా అదే చిత్రంలో నటించిన
మరో హీరోయిన్‌ సంచనల వ్యాఖ్యలు చేసింది.మరో హీరోయిన్‌గా నటించిన నూరిన్ షరీఫ్.. ప్రియా
వారియర్‌ను ఉద్దేశించి సెన్సేషనల్ కామెంట్లు చేశారు. ఈ చిత్రంలో మొదట తననే మెయిన్‌
హీరోయిన్‌గా అనకున్నారన్నారు.ప్రియ కంటే తన పాత్ర పరిధే ఎక్కువగా ఉండేదని కథ మొత్తం
తన చుట్టూ తిరిగేలా స్క్రిప్టు రూపొందించారన్నారు.అయితే గత ఏడాది విడుదల చేసిన టీజర్‌లో
ప్రియ కన్నుగీటుకు యువత వెర్రెత్తిపోయి ప్రియ ఒక్కసారిగా నేషనల్‌క్రష్‌గా మారిపోవడంతో
స్క్రీప్టు మొత్తం మార్చేసారని ప్రియ పాత్రను ఎలివేట్‌ చేయడానికి తన పాత్ర పరిధి తగ్గించేసారని
చిత్ర బృందం తీసుకున్న నిర్ణయం తనను ఎంతగానో బాధించిందన్నారు.ప్రియకు వచ్చిన పాపులారిటీతో
చిత్రంలో తన పాత్ర పూర్తిగా మారిపోయిందని మెయిన్‌ రోల్‌ కాస్తా సహాయ పాత్రగా మారిందన్నారు.ఈ
చిత్రంలో తనకు జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇకపై ప్రియతోకలసి నటించకూడదని
నిర్ణయించుకున్నానన్నారు.ఒకవేళ దర్శక నిర్మాతలు పట్టుబడితే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తానని
సాధ్యమైనంత వరకు ప్రియతో కలసి నటించడానికికి అంగీకరించకుండా ఉంటానన్నారు.ఎందుకంటే నా
కెరీర్‌ను ఆమె గందరగోళంలో పడేసింది అని నూరీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియా
వారియర్‌ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఒరు ఆడార్ లవ్ సినిమా కథను దర్శకుడు ఒమర్ లులు
మార్చేశారు. క్లైమాక్స్ తప్ప మిగితా అంతా రీషూట్ చేశారు. విషాదకరంగా సినిమా ముగియడం
ప్రేక్షకులను ఆకట్టుకోలేదు అనే వాదన వినిపించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos