చల్లదనానికి చిట్కాలు

చల్లదనానికి చిట్కాలు

ఎండా కాలం వచ్చేసింది.
ఇంటిలో ఉంటే ఉక్కపోత. బయటకు వెళితే మాడ్చేస్తున్న ఎండలు. కనీసం ఇంటిలో
ఉండేటప్పుడైనా కొంత చల్లదనం ఉంటే బాగుంటుందని మనసు కోరుకుంటుంది. అయితే అందరూ
ఏసీలు, ఎయిర్‌ కూలర్లు కొనలేరు. ఇలాంటి వారు తక్కువ ఖర్చుతో చల్లదనాన్ని
సృష్టించుకోవచ్చు. అదెలాగంటే…. ఒకే అంతస్తు ఉండే వ్యక్తిగత (ఇండివిడ్యుయల్) ఇళ్లు, అపార్ట్ మెంట్లలో అన్నింటికన్నా పై అంతస్తులో ఉండే ఫ్లాట్ల సీలింగ్ పైకి ఎండ నేరుగా పడుతుంది. అందువల్ల పైకప్పు (సీలింగ్) బాగా వేడెక్కి ఆ వేడి ఇంట్లోకి వస్తుంది. ముఖ్యంగా ఇలా పైకప్పు వేడెక్కి ఉన్నప్పుడు సీలింగ్ ఫ్యాన్ వినియోగించడం వల్ల ఫ్యాన్ పైకప్పు వేడిని గదిలోకి విడుదల చేసి.. వేడి మరింత పెరుగుతుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే పైకప్పు పైన నేరుగా ఎండ పడే ప్రాంతంలో కూల్ సిమెంట్ కోటింగ్ లేదా రిఫ్లెక్టివ్ కోటింగ్ వేయించాలి.

ఇంట్లో కిటికీలు, తలుపుల వద్ద తెర చాపలను, నారతో తయారయ్యే చాపలను అమర్చుకోవడం వల్ల ఇంట్లోకి వేడి గాలి రాకుండా ఉంటుంది. ఈ చాపలు వేడిని అడ్డుకుంటాయి. దాంతో ఇంట్లోకి చల్లటి గాలి వీస్తుంది. ముఖ్యంగా ఇంట్లోకి గాలి వీచే దిక్కుల్లో ఉన్న కిటికీలు, తలుపుల వద్ద తెరచాపలు ఏర్పాటు చేసి, వాటిని తరచూ కొంత నీటితో తడుపుతూ ఉండడం వల్ల ఇంటి లోపలి ఉష్ణోగ్రత ఏకంగా నాలుగైదు డిగ్రీలు తగ్గే అవకాశం ఉంటుంది. 


తెరచాపలే కాకుండా కూలర్లలో వినియోగించే తరహా గడ్డి చాపలు, మ్యాట్ లు కూడా లభిస్తాయి. అవి నీటిని ఎక్కువ సేపు పట్టి ఉంచుతాయి. దీంతో ఎక్కువ సేపు చల్లదనం ఉంటుంది.

– తెర చాపలు, మ్యాట్ ల వంటివి లేకపోతే కాస్త మందమైన బెడ్ షీట్లు, పెద్ద సైజు టవల్స్ వంటివి కూడా నీటితో తడిపి తలుపులు, కిటికీల వద్ద కట్టుకోవచ్చు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos