మార్కెట్లో లభ్యమవుతున్న డైట్ సోడా లాంటి
వాటితో కంటి సమస్యలు ఎదురవుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వీటి వాడకం వల్ల శరీరంలో
చక్కెర స్థాయి పెరగడమే కాకుండా అంధత్వం లాంటి ముప్పు కూడా పొంచి ఉంటుందని తెలిపారు. సుమారు
600 మంది షుగర్ వ్యాధిగ్రస్తుల మీద అధ్యయనం నిర్వహిస్తే, 73 మంది టైపు 2 డయాబెటీస్తోనూ, మిగతా వారు టైప్ 1
డయాబెటీస్తోనూ బాధపడుతున్నట్లు తేలిందన్నారు. వీరికి కొన్నిరోజుల పాటు డైట్ సోడా ఇచ్చి, ఆరోగ్యాన్ని పరిశీలించగా పది శాతం మందికి కంటి సంబంధ సమస్యలున్నాయని గుర్తించారు. ఈ సమస్యలు శాశ్వత అంధత్వానికి దారితీయవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. సాధారణ సాఫ్ట్ డ్రింకులు కలిగించే నష్టాన్నే డైట్ సోడా కలిగిస్తుందనీ, దీని వలన ఆరోగ్యానికి హాని కలిగే అవకాశాలే ఎక్కువని వారు స్పష్టం చేస్తున్నారు. అంతే కాకుండా డైట్ సోడా తీసుకోవడం వలన ఊబకాయం, అధికబరువు రాదన్న గ్యారంటీ లేదని వారు అంటున్నారు.