గెలాక్సీ ఎస్‌9ప్లస్‌ ధర భారీ తగ్గింపు

  • In Money
  • February 5, 2019
  • 147 Views
గెలాక్సీ ఎస్‌9ప్లస్‌ ధర భారీ తగ్గింపు

న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో దూసుకుపోయేందుకు దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ కొత్త ప్రణాళికలతో వస్తోంది. చైనా కంపెనీ షావోమికి దీటుగా ఇటీవల బడ్జెట్‌ ధరల్లో ఎం10, ఎం20 స్మార్ట్‌ఫోన్లను  తీసుకొచ్చిన సంస్థ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. తన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ శాసంగ్‌ గెలాక్సీ ఎస్‌9ప్లస్‌ ధరలపై శాశ్వత తగ్గింపును ప్రకటించింది. ఎస్‌9ప్లస్‌ అన్ని వేరియంట్లపై  రూ.7వేల తగ్గింపు అందిస్తోంది. ఈ తగ్గింపు ఆన్‌లైన్‌ విక్రయాలకు మాత్రమే వర్తించనుంది.

గెలాక్సీ ఎస్‌9 + 64జీబీ  స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 57,900,  దీని లాంచింగ్‌ ధర రూ. 64,900.
128 జీబీ  స్టోరేజ్‌ వేరియంట్‌ రూ 61,900.  లాంచింగ్‌ ధర రూ. 68,900
256జీబీ  స్టోరేజ్‌ వేరియంట్‌ రూ 65,900. లాంచింగ్‌ ధర 72,000.  

తాజా సమాచారం

Latest Posts

Featured Videos