చెన్నై: తమిళనాడులో ఆదాయపన్నుశాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. చెన్నై, కోయంబత్తూరు ప్రాంతాల్లోని 74 చోట్ల ఏకకాలంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. శరవణ స్టోర్స్, రేవతి గ్రూప్, లోటస్ సంస్థలకు చెందిన నగలు, వస్త్ర దుకాణాల్లో ఈ ఉదయం నుంచి 150 మందికి పైగా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదాయపన్ను శాఖకు సమర్పించిన పత్రాల్లో చూపించిన లెక్కలకు పొంతన కుదరడం లేదనే ఆరోపణలపై సోదాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.