6 న నింగిలోకిజీశాట్-31

6 న నింగిలోకిజీశాట్-31

హైద‌రాబాద్: ఇస్రో మ‌రో క‌మ్యూనికేష‌న్ శాటిలైట్‌ను ప్ర‌యోగించ‌నున్న‌ది. ఈనెల 6వ తేదీన జీశాట్ 31ను ఫ్రెంచ్ గ‌యానా నుంచి నింగిలోకి పంప‌నున్నారు. టెలివిజ‌న్ అప్‌లింక్‌, డీటీహెచ్ టెలివిజ‌న్ స‌ర్వీసుల కోసం దీన్ని వాడ‌నున్నారు. 15 ఏళ్ల మిష‌న్ లైఫ్‌తో దీన్ని ప్ర‌యోగిస్తున్నారు. జీయోస్టేష‌న‌రీ ఆర్బిట్‌లో క్యూ బ్యాండ్‌ను మ‌రింత బ‌లోపేతం చేయ‌నున్నారు. ఏరియేన్ 5 రాకెట్ ద్వారా 2535 కిలోల బ‌ర‌వున్న శాటిలైట్‌ను ప్ర‌యోగిస్తున్నారు. భార‌త భూభాగంతో పాటు దీవి ప్రాంతాల‌కు జీశాట్ 31 సిగ్న‌ల్స్ అందిస్తుంది. వీసాట్ నెట్‌వ‌ర్క్స్‌, టెలివిజ‌న్ అప్‌లింక్స్‌, డిజిట‌ల్ శాటిలైట్‌, డీటీహెచ్ టెలివిజ‌న్ స‌ర్వీసు, సెల్యూలార్ క‌నెక్టివిటీ కోసం జీశాట్ 31ను వినియోగించ‌నున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos