గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా వచ్చిపోయిన వారు దాదాపు 6.6 లక్షల మంది వరకు ఉండొచ్చన్న విషయాన్ని సీసీఎంబీ తాజాగా వెల్లడించింది.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మురుగునీటి శాంపిళ్లను సేకరించి.. వాటి ఆధారంగా తాజాగా వేసిన లెక్క ఒకటి వెల్లడించారు.హైదరాబాద్ మహానగరంలో రోజుకు 1800 మిలియన్ లీటర్ల మురుగునీటి వ్యర్థాలు వస్తుంటాయి. వాటిల్లో 40 శాతం మేర పలు మురుగునీటి శుద్ధి కేంద్రాలకు వస్తాయి. మురుగును అక్కడ శుద్ధి చేస్తారు. సీసీఎంబీ పరిశోధకులు జులై 8నుంచి ఆగస్టు ఆరువరకు ఆయా మురుగునీటి శుద్ధి కేంద్రాల నుంచి నాలుగు సార్లు నమూనాల్ని సేకరించారు. వాటిల్లో కరోనా ఆర్ ఎన్ ఏ అవశేషాల కోసం పరీక్షలు జరిపారు. సీసీఎంబీ శాస్త్రవేత్తలు సేకరించిన శాంపిళ్లు నగరంలో విడుదలయ్యే మొత్తం మురుగునీటిలో 40 శాతం మాత్రమే.వీరి అధ్యయనం ప్రకారం 2.2 లక్షల మందికి కరోనా సోకి ఉండొచ్చని అంచనా వేశారు. తాము సేకరించిన 40 శాతం మురుగునీటి శాంపిల్ లో ఇంత మంది అయినప్పుడు.. మొత్తం వందశాతం మురుగునీటిని పరిగణలోకి తీసుకుంటే.. హైదరాబాద్ లో ఏకంగా 6.6లక్షల మందికి కరోనా వచ్చి పోయి ఉండొచ్చన్నది తాజా విశ్లేషణ. మరిన్ని కేసులు వచ్చినప్పుడు అవి ఎందుకు బయటకు వెలుగు చూడలేదంటే.. దానికి కారణంగా కరోనాయాంటీ బాడీలు ఎక్కువగా ఉన్నప్పుడు.. వాటి ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. దీంతో.. ఆసుపత్రుల మీద భారీ ఒత్తిడి పడలేదు.