5 నెలల్లో 120 చలాన్లు

  • In Crime
  • January 29, 2019
  • 205 Views
5 నెలల్లో 120 చలాన్లు

అతను ఓ క్యాబ్‌డ్రైవర్‌.. గచ్చిబౌలి-శంషాబాద్‌ మార్గంలో ప్రతిరోజు తన క్యాబ్‌లో ప్రయాణికులను తీసుకెళుతుంటాడు. గత ఐదు నెలల్లోనే అతని క్యాబ్‌పై ఏకంగా 120 చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. నో పార్కింగ్‌, అతివేగం, సీటుబెల్టు పెట్టుకోకపోవడం ఇలా ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు పోలీసులు అతనికి చలాన్లు వేశారు. మొత్తం రూ.19,930 చెల్లించాల్సి ఉండటంతో సోమవారం పోలీసులు అతని వాహనాన్ని సీజ్‌చేశారు. గచ్చిబౌలి చౌరస్తాలో సోమవారం ట్రాఫిక్‌ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై ‘నో పార్కింగ్‌’ ప్రాంతంలో నిలిపి ఉన్న కారును గమనించిన పోలీసులు  గత జరిమానాలను పరిశీలించారు. 120 చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. కారును సీజ్‌చేస్తూ డ్రైవర్‌ రమేష్‌కు పత్రాలు అందించిన పోలీసులు… పెండింగ్‌లో ఉన్న మొత్తం చలాన్లు చెల్లించాలని సూచించారు. పది కంటే ఎక్కువ చలాన్లు పెండింగ్‌లో ఉంటే నిబంధనల ప్రకారం వాహనాలను సీజ్‌ చేస్తామని ట్రాఫిక్‌ ఎస్‌ఐ రఘకుమార్‌ చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos