400 మంది అమెరికాకు అక్రమ తరలింపు

400 మంది అమెరికాకు అక్రమ తరలింపు

అమెరికాకు అక్రమంగా మనుషులను తరలించినట్టు భారత సంతతికి చెందిన యద్వీందర్‌సింగ్ బంభా న్యూయార్క్ కోర్టులో అంగీకరించారు. 60 సంవత్సరాల బంభా నిజానికి చాలామంది అమెరికాలోకి దూరేందుకు తోడ్పడ్డాడు. కానీ వ్యక్తిగతంగా 400 మందిని చేర్చాడట. అందుకు వారి వద్ద 30 వేల నుంచి 85 వేల డాలర్ల వరకు (భారతీయ కరెన్సీలో అయితే రూ.20 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు) వసూలు చేశాడట. 2013-2016 మధ్యకాలంలో ఈ తరలింపులు జరిగాయి. 2017లో బంభాను డొమినికన్ రిపబ్లిక్‌లో అరెస్టు చేసి పోర్టారికోకు తరలించారు. అందులో భారతీయులు కూడా ఉన్నారు. ముందుగా మనుషుల్ని డొమినికన్ రిపబ్లిక్‌కు చేర్చి అక్కడ నుంచి బోట్లలో అమెరికాకు తరలించేవారు. ఈ బోటు ప్రయాణాలు అత్యంత దుర్భరంగా ఉండేవని అధికారులు అంటున్నారు. ఇలాంటి ప్రయాణాల సందర్భంగానే ఓ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయాడట కూడా. ఇతర ముఠాల సాయంతో వారికి నకిలీ ధృవపత్రాలు సమకూర్చేవారు. నేరాంగీకారం పూర్తికావడంతో ప్రస్తుతం కోర్టులో సిక్షాకాలంపై విచారణ జరుగుతున్నది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos