మూడో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

మూడో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మంగళవారం
మూడో విడత పోలింగ్‌ జరుగనుంది. పోలింగ్‌ సిబ్బంది ఈవీఎంలను వెంటబెట్టుకుని
నిర్దేశిత పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత
ప్రాంతాల్లోని 116 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగనుంది. కేరళలోని మొత్తం 20
స్థానాలకు, కర్ణాటకలో రెండో విడతలో 14 పోను, మిగిలిన 14 స్థానాలకు ఈ విడతలోనే
పోలింగ్‌ జరుగనుంది. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌
ప్రక్రియ పూర్తవుతుంది. ఫలితాల కోసం వచ్చే నెల 23 వరకు వేచి ఉండాలి. ఇంకా గుజరాత్‌లోని
మొత్తం 26 స్థానాలు, మహారాష్ట్రలో 14, ఉత్తరప్రదేశ్‌లో పది, చత్తీస్‌గఢ్‌లో ఏడు,
ఒడిశాలో ఆరు, బిహార్‌, బెంగాల్‌లలో అయిదేసి, అసోంలో నాలుగు, గోవాలో రెండు,
దాద్రానగర్‌, హవేలి, డామన్‌, జమ్ము కశ్మీర్‌లో ఒక్కో స్థానాలకు పోలింగ్‌
చేపట్టాల్సి ఉంటుంది. దీంతో దేశంలో సగానికి పైగా లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌
పూర్తవుతుంది. రెండో దశలో తమిళనాడులో ఓ చోట ఎన్నిక వాయిదా పడగా, మరో చోట ఎన్నిక
రద్దయింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos