న్యూ ఢిల్లీ: కరోనా మందు-2 డీజీ ధరను రూ. 990గా నిర్ణయించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇందులో రాయితీ ఉంటుంది. పొడి రూపంలో ఉండే ఈ మందును డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్తో కలిసి డీఆర్డీఓ ఆధ్వర్యంలోని ఇన్మాస్ అభివృద్ధి చేసింది. ఆక్సిజన్ అవసరమైన కొవిడ్ బాధితులు త్వరగా కోలుకునేందుకు ఇది పని చేస్తుంది. నీటిలో కలుపుకుని తాగాలి. దీనికి భారత ఔషధ నియంత్రణ సంస్థ-డీజీసీఐ ఇటీవలె అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చింది.