14 నుంచి బంగారం బాండ్ల విక్రయం

  • In Money
  • January 12, 2019
  • 793 Views

ముంబై: సార్వభౌమ బంగారం బాండ్ల మలి విడత విక్రయం ఈ నెల 14న ప్రారంభం కానుంది. 18వ తేదీ వరకు కొనసాగుతుంది. ఓ గ్రాము బంగారం ధర రూ.3,214గా ఆర్‌బీఐ ఖరారు చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, డిజిటల్‌ రూపంలో చెల్లించే వారికి గ్రాము బంగారంపై రూ.50ను తగ్గింపు ఇవ్వనున్నట్టు తెలిపింది. దీంతో గ్రాము బంగారాన్ని రూ.3,614కే ఇవ్వనుంది. బ్యాంకులు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు. ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 500 గ్రాముల వరకు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఉం ది. కనీస పెట్టుబడి ఒక గ్రాము. సార్వ భౌమ బం గారం బాండ్‌ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా 2015 నవంబర్‌లో ప్రారంభించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos