100 రోజుల్లో దేశం అస్తవ్యస్థం

100 రోజుల్లో దేశం అస్తవ్యస్థం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్రం ప్రభుత్వ 100 రోజుల సాధన దేశం అస్తవ్యస్థం కావటమేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కపిల్ సిబాల్ శుక్రవారం ఇక్కడ వ్యాఖ్యానించారు. ‘… నూరు రోజుల సాధన కేవలం ట్రైలర్ మాత్రమే…. అసలైన సినిమా ముందుంద’ని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల్ని ఎద్దేవా చేసారు. ‘దేశ ఆర్థిక వ్యవస్థ పతనమవుతోంది. ఆటోమొబైల్స్ అమ్మకాలు పడిపోయాయి. ఉద్యోగాలపై ఆందో ళన నెలకొంది. ఎన్నో సమస్యలతో దేశం ఇబ్బంది పడుతోంది. అబద్ధాలతో కూడిని మోదీ సినిమాను నేను చూడ దలుచు కోలేదన్నారు.‘ ఈ 100 రోజుల ట్రైలర్ లో జీడీపీ 5 శాతానికి పతనమైంది. వినియోగం, ఆటోమొబైల్స్ అమ్మకాలు, జీఎస్టీ వసూళ్లు, వ్యాపార, పారిశ్రామిక పెట్టుబడులు తగ్గి పోయాయి. నిరుద్యోగం మాత్రం 8.2 శాతం పెరిగింది. ఈ ట్రైలర్ చాలు. మొత్తం సినిమాను తాము చూడలేమ’ని ఎద్దేవా చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos