100కి పైగా కార్లు దగ్ధం

100కి పైగా కార్లు దగ్ధం

బెంగళూరుఇక్కడి యలహంక వైమానిక స్థావరంలో జరుగుతున్న అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన – ఏరో ఇండియా2019లో శనివారం  భారీ అగ్ని ప్రమాదం సంభవించటంతో నూటికి పైగా కార్లు, జీపులు, ద్వి చక్ర
వాహనాలు దగ్ధమయ్యాయి. మంటల్ని ఆర్పే బృందాలు  హుటాహుటిన ప్రమాద స్థలాన్ని చేరుకుని ఆర్పాయి.
వాయుసేన పోలీస్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అధికారులు పర్యవేక్షిస్తున్నారు.  ‘నూటికి పైగా వాహనాలు కాలిపోయినట్లు
పోలీసు ఉ న్నతాధికారి హరిశేఖరన్‌ వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరా లేదు. ఏరో ఇండియా గేట్ 5 వద్ద 1 గంట సమయంలో మొదలైన మంటలు సమీపంలో వాహనాలకువ్యాపించాయి. ఎండుగడ్డికి నిప్పంటుకోవటమే
ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.  ఇంధన ట్యాంకు ఒకటి పేలడంతో భారీఎత్తున మంటలు, దట్టమైన పొగ ఎగసిపడ్డాయి. పర్యవసానంగా వైమానిక ప్రదర్శనను నిలిపి వేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos