హీట్ పెంచుతున్న పంచాయతీ ఎన్నికలు

తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికలు హీట్ పెంచుతున్నాయి. అంసెబ్లీ ఎన్నికలకు దీటుగా ప్రచారం కోనసాగుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో తోలి విడుతలో ఎన్నికల జరిగే పంచాయితీలలో ప్రచారం ఉపందుకుంది. అభ్యర్థులు పోటాపోటి ప్రచారాలతో గ్రామలలో పోలీటికల్ హీట్ పెరుగుతుంది.
అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు పొలిటికల్‌ హీట్ పెంచుతున్నాయి పార్టీ గుర్తుల మీద ఈ ఎన్నికలు జరగకున్నా నేతలు మాత్రం స్థానిక సమరాన్ని సీరియస్ గానే తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పట్టు సాధించి, లోక్‌సభ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఏకగ్రీవాల్లో టీఆర్ఎస్‌ ముందంజలో ఉన్నా, క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీసైతం అక్కడక్కడా పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది.ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో.. మూడు విడతల్లో గ్రామ పంచాయితీల ఎన్నికలు జరుగనున్నాయి. నల్లగొండ జిల్లా పరిధిలో మొదటి విడత దేవరకొండ డివిజన్‌లోని 10 మండలాలు.. రెండో విడత మిర్యాలగూడలోని 10 మండలాలు.. మూడో విడత నల్లగొండ డివిజన్‌లోని 11 మండలాల పరిధిలోని గ్రామ పంచాయితీ ల ఎన్నికలు ఉంటాయి. తొలి విడతలో దేవరకొండ డివిజన్‌లోని.. దేవరకొండ, కొండమల్లేపల్లి, చింతపల్లి, డిండి, పీఏపల్లి, గుర్రంపోడు, మర్రిగూడ, చందంపేట, నేరేడుగొమ్ము, నాంపల్లి మండలాల పరిధిలోని 304 గ్రామపంచాయతీలు.. 2వేల 572 వార్డు స్థానాలకు జనవరి 21 తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇక.. రెండోవిడత మిర్యాలగూడ డివిజన్‌ పరిధిలోని 10 మండలాల్లో 276 సర్పంచ్‌లు.. 2వేల 376 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడో విడతలో నల్లగొండ డివిజన్‌లోని 11 మండలాల పరిధిలోని 257 గ్రామ పంచాయతీలు, 2వేల 322 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి.సూర్యాపేట జిల్లాలో మొదటి విడతలో 161, రెండో విడతలో160, మూడో విడత-154 లచొప్పున మొత్తం 475 గ్రామ పంచాయితీల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇక.. యాదాద్రి-భువనగిరి జిల్లాలోనూ మొదటి విడతలో 148, రెండో దఫా-124, మూడోదఫా-129 చొప్పున మొత్తం 401 పంచాయితీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అయితే నల్లగొండ, యాదాద్రి-భువనగిరి, సూర్యాపేట జిల్లాల పరిధిలో మొదటి విడతలో 90 సర్పంచి పదవులు.. రెండో విడతలోనూ మరో 88 గ్రామ పంచాయతీల ఏకగ్రీవమయ్యాయి. రెండో దశలోనూ ఇప్పటివరకు 88 గ్రామ పంచాయితీలు ఏకగ్రీవం అయ్యాయి. ఉమ్మడి జిల్లాల్లో ఏకగ్రీవమైన సర్పంచి పదవుల్లో 90 శాతం నూతనంగా ఏర్పడిన తండాలే ఉన్నాయి.గ్రామ పంచాయతీల ఎన్నికలు పార్టీల రహితంగా జరుగుతున్నాయి. అయితే నేతలు మాత్రం వీటిని సీరియస్ గానే తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 12 స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోయి ఘోర పరాజయం పాలైన BJP.. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పంచాయతీ ఎన్నికల్లో చాలా గ్రామాల్లో TRS కు మద్దతు పలుకుతోంది. మొన్నటి ఎన్నికల్లో పది వేలకు పైగా ఓట్లు సాధించిన మునుగోడు, సూర్యాపేట నియోజకవర్గాలతోపాటు.. నాగార్జునసాగర్‌, ఆలేరు, సూర్యాపేటల్లో బీజేపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ఎక్కువగా TRS బలపర్చిన అభ్యర్థులకు సపోర్ట్‌ చేస్తున్నారు. అయితే కొన్నిచోట్ల ఉప సర్పంచి పదవి వస్తుందనే ఆశతో కాంగ్రెస్‌తో బీజేపీ నేతలు జట్టుకడ్తున్నారు. మరోవైపు అధికార పార్టీకి తిరుగుబాటు అభ్యర్థుల బెడద ప్రమాదంగా మారింది. జనరల్‌, బీసీ జనరల్‌ వచ్చిన స్థానాల్లో అధికార పార్టీ నుంచే దాదాపు నలుగురైదుగురు ఆశావహులు ఉండటంతో వారిని సముదాయించేందుకు మండల స్థాయి నేతలు రంగంలోకి దిగుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలే జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి.ఒకప్పుడు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థిని వ్యక్తిగతంగా చూసి ఏకగ్రీవంగా ఎన్నుకునేవారు. ప్రస్తుతం రాజకీయాల అర్థం మారిన నేపథ్యంలో ఇన్నాళ్లు పార్టీ జెండా మోసిన వారికి అవకాశాలు రావడం గగనమైపోయింది. రిజర్వేషన్‌ కలిసి వస్తుందనే ఆశతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, హైదరాబాద్‌, విదేశాల్లో స్థిరపడిన వారుసైతం బరిలో నిలుస్తున్నారు. గ్రామాభివృద్ధికి లక్షల రూపాయల నిధులు ఇస్తామని ఆశచూపడడంతో పాటు.. స్థానిక నేతలను ప్రభావం చేయడంతో చాలా చోట్ల డబ్బులున్న వారే ఏకగ్రీవం అవుతున్నట్లు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో మహాకూటమిగా కాంగ్రెస్‌తో కలిసి బరిలోకి దిగిన కమ్యూనిస్టులు యథాప్రకారం కాంగ్రెస్‌కే మద్దతు పలుకుతున్నారు. ఉమ్మడి జిల్లాలో వీరి ప్రభావం స్వల్పంగానే ఉన్నా, దేవరకొండ, ఆలేరు, మునుగోడు లాంటి ప్రాంతాల్లో ఆ పార్టీ నేతలు కాంగ్రెస్‌తోనే ప్రచారం చేస్తున్నారు. మరోవైపు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటిదశలో 90 గ్రామాలు ఏకగ్రీవం కాగా.. అందులో సగం గ్రామాల్లో అభ్యర్థులు గ్రామాభివృద్ధికి నిధుల పేరిట డబ్బులు ఖర్చుపెట్టినవారే కావడం గమనార్హం. ఇక.. రెండోదశలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది.ఏదిఏమైనా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గ్రామ పంచాయితీ ఎన్నికల్లోనూ డబ్బు, మద్యం ఏరులై పారుతోంది. రిజర్వేషన్ స్థానాలు మినహాయిస్తే.. జనరల్ స్థానాల్లోమాత్రం డబ్బున్న వారికే సర్పంచ్ పదవి అన్న చందంగా సాగుతోంది. దీంతో.. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలే కాదు.. పంచాయతీ ఎన్నికల్లోనూ సామాన్యుడు పోటీ చేయలేని పరిస్థితి తలెత్తుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos