ముంబయి: నేడు దలాల్ స్ట్రీట్ లాభాలతో ప్రారంభమై వెంటనే నష్టాల్లోకి జారుకుంది. సెన్సెక్స్ 60 పాయింట్లకు పైగా లాభంతో 36,400 పాయింట్ల వద్ద, నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో 10900 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. ఔషధ రంగాల షేర్లు నష్టాల్లో కొనసాగడం మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. సన్ ఫార్మా షేర్లు బాగా నష్టపోతున్నాయి. ఉదయం 9.40 సమయానికి సెన్సెక్స్ 47.26 పాయింట్ల కోల్పోయి 36326.82 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 30 పాయింట్లు కోల్పోయి 10875 వద్ద కదలాడుతోంది.
నేడు ఎన్‌ఎస్‌ఈలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఓఎన్‌జీసీ, రిలయన్స్, భారతి ఇన్‌ఫ్రాటెల్, ఎన్‌టీపీసీ తదితర కంపెనీల షేర్లు లాభపడుతున్నాయి. సన్ ఫార్మా, యస్ బ్యాంకు, అల్ట్రాటెక్ సిమెంట్, గెయిల్, యాక్సిస్ బ్యాంకు తదితర కంపెనీల షేర్లు నష్టపోతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.71.20 వద్ద ట్రేడవుతోంది.