ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రచురణ సంస్థ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) వ్యాజ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి చుక్కెదురైంది. పత్రిక కార్యాలయ భవనాన్ని ఖాళీ చేయాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను పాటించి తీరాలని గురువారం డిల్లీ ఉన్నత న్యాయస్థానం గురువారం తేల్చి చెప్పింది. ఢిల్లీ ఐటీవో ప్రాంతంలో హెరాల్డ్ సంస్థ గత 56 ఏళ్లుగా కొనసాగుతోంది. ఐటీవో ప్రాంతంలో ఎలాంటి వార్తా సంస్థలు కొనసాగరాదని కేంద్రం గతంలో తీర్మానించింది. గత పదేళ్లుగా ఐటీవో ప్రాంతంలో వార్తా సంస్థల నిర్వహణకు అనుమతివ్వ లేదని తెలిపింది. దరిమిలా 56 ఏళ్ల కిందట అసోషియేట్ జర్నల్స్ లిమిటెడ్‌కు ఇచ్చిన లీజును కేంద్రం రద్దు చేసింది. పర్యవసానంగా షనల్ హెరాల్డ్ ఆఫీస్‌ను ఖాళీ చేయాలని ఉత్తర్వులిచ్చింది. దీన్ని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) గతంలో ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం హైకోర్టులో సవాలు చేసి స్టే ఉత్తర్వు పొందింది. గురువారం ఆ స్టేను ఢిల్లీ ఉన్నత న్యాయ స్థానం ఉపసంహరించుకుని పత్రిక కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సిందేనని తీర్పు నిచ్చింది.