సీఎం చంద్రబాబు సీరియస్ కావడంతో..

సీఎం చంద్రబాబు సీరియస్ కావడంతో..

ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు. అక్కడంతా భక్తి భావమే వెల్లివిరియాలి. రాజకీయాల వంటి భౌతిక అంశాలకు చోటు లేదు. కానీ ఇటీవల ఏపీలో ఆలయాల సందర్శనకు వెళ్లి, తెలంగాణ నేతలు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. సీఎం చంద్రబాబు సీరియస్ కావడంతో ఆలయాల్లో ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇవి అమల్లోకి వచ్చాయి. త్వరలో మరికొన్ని మార్గదర్శకాలు విడుదల చేయడానికి ఏపీ సర్కారు సన్నాహాలు చేస్తోంది.ఆలయాలు భక్తివికాస కేంద్రాలు. అక్కడంతా దైవనామ స్మరణే జరగాలి. కానీ తుచ్ఛమైన, అల్పమైన విషయాలకు ఇవి కేంద్రాలు కాకూడదు. అయితే ఈ మధ్య తిరుమల, విజయవాడలో దర్శనానికి వెళ్లిన టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ఏపీ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. ఇక్కడ రాజకీయాలు బాగోలేవని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెడ్తామని, కేసీఆర్ రిటర్న్‌ గిఫ్ట్ ఇస్తారంటూ ఆయన మాట్లాడడంపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు.ఆలయాల్లో తలసాని పొలిటికల్‌ కామెంట్లపై సీఎం చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారు. ఆలయాల్లో మొక్కులకు వచ్చి రాజకీయ వ్యాఖ్యలు చేస్తారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలపర్యటనల్లో పాల్గొనవద్దని టీడీపీ నేతలకు సూచించారు. ఎవరైనా పాల్గొంటే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. బంధుత్వాలు ఉంటే ఇంట్లో పెట్టుకోవాలి, స్నేహాలు ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి. బంధుత్వాలు, స్నేహాల పేరుతో పార్టీని పణంగా పెట్టరాదని, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయవద్దని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసే చర్యలను సహించబోనని చంద్రబాబు స్పష్టం చేశారు.మరోవైపు ఆలయాల్లో రాజకీయాలపై విజయవాడ ఈవో కోటేశ్వరమ్మ స్పందించారు. ఇంద్రకీలాద్రి రాజకీయపరమైన కార్యకలాపాలపై ఆంక్షలు విధించారు. దుర్గగుడికి వచ్చే రాజకీయ నాయకుల గురించి మీడియాకు ముందస్తు సమాచారం ఇవ్వకూడదని సిబ్బందిని ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలో రాజకీయ, వ్యాపార పోస్టర్లు అంటించకుండా, బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ నాయకులు మంది మార్బలంతో రాకుండా పరిమితంగా రావాలని ఈవో సూచించారు. ఆలయంలో రాజకీయాలు మాట్లాడకూడదని..అమ్మవారి గురించి మాత్రమే మాట్లాడాలని ఈవో స్పష్టం చేశారు.మరోవైపు తిరుమలలో తలసాని రాజకీయ వ్యాఖ్యలు చేయడంపై టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌ స్పందించారు. ఏడుకొండలపై ఎలాంటి రాజకీయపరమైన కార్యక్రమాలను అనుమతి లేదన్నారు. బంధుత్వాలు, ఇంటికే పరిమితమని స్పష్టం చేశారు.ఆలయాల్లో రాజకీయ కార్యక్రమాలపై విజయవాడలో ఆంక్షలు అమలు చేస్తుండగా, దీని స్ఫూర్తితో ఏపీ సర్కారు త్వరలో మరిన్ని మార్గదర్శకాలు తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos