‘సిమి’పై నిషేధం మరో ఐదేళ్ల పొడిగింపు

‘సిమి’పై నిషేధం  మరో ఐదేళ్ల పొడిగింపు

న్యూఢిల్లీ: స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై కొనసాగుతున్న నిషేధాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ‘తిరుగుబాటు చర్యల్లో’ పాలుపంచుకుంటున్నట్టు ఆరోపిస్తూ సిమిపై  ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ‘‘దేశ భద్రతకు ప్రమాదం కలిగించే చర్యల్లో పాలుపంచు కుంటున్నందున, శాంతికి, మత సామరస్యానికి విఘాతం కలిగిస్తున్నందున, దేశ లౌకిక విధానానికి అంతరాయం సృష్టిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నాం…’’ అని జనవరి 31న విడుదల చేసిన ఓ ప్రకటనలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. చట్టవ్యతిరేకమైన పనులు, తిరుగుబాగు చర్యలను మానుకోవాలని… దేశ సమగ్రతకు, భద్రతకు ప్రమాదం కలిగించే కార్యకలాపాలు నిలిపివేయాలని ప్రభుత్వం హెచ్చరించింది. కాగా పోలీసు అధికారుల హత్యలు, బాంబు దాడులు, జైలు బద్దలుకొట్టడం, తీవ్రవాదులకు ఆశ్రయం కల్పించడం సహా వివిధ నేరాల్లో సిమి కార్యకర్తలు ఆరోపణలు ఎదుర్కొని, దోషులుగా తేలారు. 1977లో అలీగఢ్‌లో ప్రారంభమైన సిమిపై తొలిసారి 2001లో నిషేధం విధించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos