యోగి ప్రభుత్వంపై అఖిలేష్ వ్యంగ్యోక్తులు
లక్నో : సాధువులకు, సన్యాసులకు కూడా పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదని వస్తున్న వార్తలపై సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు,, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సోమవారం ఉదయం స్పందిస్తూ త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇది ఓటర్లను బుజ్జగించే ప్రయత్నమని వ్యాఖ్యానించారు ప్రభుత్వ నిర్ణయాలను ఎగతాళి చేస్తూ. సాధువులు, సన్యాసులు నెలకు రూ.20 వేలు పెన్షన్ ఇవ్వాలి, అలాగే రామాయణం తదితరాలను ప్రవచించే వారికి, రామ, లక్ష్మణ, సీత వంటి పాత్రలలో నటించే వారికి కూడా నెలకు రూ.20 వేలు పెన్షన్ ఇవ్వాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
పింఛను దారులకు నెలకు రూ.100లు పెంపు
అంతకుముందు రాష్ట్రంలోని పింఛను దారు లకు నెలకు రూ.100లు పెన్షన్ పెంచుతు న్నట్లు యోగి ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని వితం తువులు, వికలాంగులు, వృద్ధులు ప్రస్తుతం నెలకు రూ.400 పెన్షన్ పొందుతున్నారు. పెన్షన్‌కు అర్హు లైన వారిని నమోదు చేసుకునేందుకు నిర్వహిస్తున్న శిబిరాలను ఈ నెల 30 వరకు కొనసాగించాలని సంబంధిత అధికారులను యోగి ప్రభుత్వం ఆదేశిం చిందని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. అనా ధలు, నిరాశ్రయులు, వితంతువులు, వృద్ధులు తదితరులందరిని పెన్షన్ పథకంలోకి తీసుకు రావాలన్నది ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి తెలిపారు. సాధువులను, సన్యాసులను పెన్షన్ పథకంలోకి తీసుకువస్తున్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఆయన తెలిపారు.