ష‌ర్మిల కు అండ‌గా..రంగంలోకి విజ‌య‌శాంతి

ష‌ర్మిల కు అండ‌గా..రంగంలోకి విజ‌య‌శాంతి

వైసిపి అధినేత జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల కు మ‌ద్ద‌తుగా నిలిచారు సినీ-పొలిటిక‌ల్ ఫైర్ బ్రాండ్ విజ‌య‌శాంతి. సినీ హీరో ప్ర‌భాస్ తో త‌న‌కు సంబంధాలు ఉన్నాయంటూ చేస్తున్న ప్ర‌చారం పై ష‌ర్మిల పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. త‌న పై ప్ర‌చారం చేస్తున్న వారి పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. దీని వెనుక ట‌డిపి నేత‌లు ఉన్నార‌ని ఆరోపించారు. దీని పై టిడిపి నేత‌లు కౌంట‌ర్ ఇవ్వ‌గా..ఇత‌ర పార్టీలు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నాయి.

అండ‌గా విజ‌య‌శాంతి..

కాంగ్రెస్ పార్టీ మ‌హిళా నాయ‌కురాలు విజ‌య‌శాంతి జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల కు అండ‌గా నిలిచారు. రెండు రోజుల క్రితం ష‌ర్మిల హైద‌రా బాద్ పోలీసు క‌మిష‌న‌ర్ ను క‌లిసి త‌న పై జ‌రుగుతున్న దుష్ప్ర‌చారానికి కార‌ణ‌మైన వారి పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కో రారు.

ప్ర‌భాస్ ను క‌ల‌వ‌లేద‌ని ష‌ర్మిల

సినీ హీరో ప్ర‌భాస్ తో త‌న‌కు సంబంధాలు ఉన్నాయంటూ కొంత కాలంగా సోష‌ల్ మీడియాలో ఉద్దేశ పూర్వ‌కంగా పోస్టులు పెడుతూ..మాన‌సికంగా వేధిస్తున్నార‌ని ష‌ర్మిల ఫిర్యాదు చేసారు. తాను ఎప్పుడూ ప్ర‌భాస్ ను క‌ల‌వ‌లేద‌ని ష‌ర్మిల వివరించారు. టిడిపి నేత‌లే ఈ ర‌క‌మైన దుర్మార్గ ప్ర‌చారానికి పాల్ప‌డుతున్నార‌ని ఫిర్యాదు చేసారు. దీని పై న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ వెంట‌నే స్పందించి ప్ర‌త్య‌క టీం ను ఈ కేసు ప‌రిశోధ‌న కోసం ఏర్పాటు చేసారు. ఇదే స‌మ‌యంలో ష‌ర్మిల ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తుగా కొంద‌రు తెర మీద‌కు వ‌చ్చారు.

పోరాటం చేయాల్సిందే..

వైఎస్ జగన్ సోదరి షర్మిలపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం లో మహిళల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్ధమవుతోందన్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని మహిళా సెలబ్రిటీలపై విషంకక్కే ఈ విష సంస్కృతిని వెంటనే నియంత్రించాల్సిన అవసరం ఉంద‌న్నారు. అసలే రాజకీయాల్లో మహిళను అణగదొక్కుతూ, వారిని వేధిస్తూ పురుషాధిక్యత చాటుకునే ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతు న్నా యని విజయశాంతి ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ఈ పరిస్ధితిని అధిగమించడం కోసం, పోలీసులు, ప్రభుత్వం వెంటనే స్పందించి చర్య తీసుకునే విధంగా యావత్ మహిళా లోకం సోషల్ మీడియా వేదికగా పోరాటం చేయాలని విజయశాం తి పిలుపునిచ్చారు. ఇది 40 సంవత్సరాల నుంచి సినిమా, రాజకీయాలలో మహిళా సాధికారత కోసం పోరాడిన వ్యక్తిగా తన స్పష్టమైన అభిప్రాయమని విజ‌య‌శాంతి వివ‌రించారు. ఇప్పుడు ఈ అంశం పై మ‌రింత మంది మ‌హిళా నేత‌లు స్పందించే అవ‌కాశం క‌నిపిస్తోంది.

Read more at: https://telugu.oneindia.com/news/pulivendula/vijayasanthi-stand-sharmila-call-support/articlecontent-pf206542-237867.html

Read more at: https://telugu.oneindia.com/news/pulivendula/vijayasanthi-stand-sharmila-call-support/articlecontent-pf206542-237867.html

Read more at: https://telugu.oneindia.com/news/pulivendula/vijayasanthi-stand-sharmila-call-support/articlecontent-pf206541-237867.html

Read more at: https://telugu.oneindia.com/news/pulivendula/vijayasanthi-stand-sharmila-call-support/articlecontent-pf206540-237867.html

తాజా సమాచారం

Latest Posts

Featured Videos