శాంసంగ్ గెలాక్సీ ఎస్10ఈ ఫీచర్లు

  • In Money
  • February 2, 2019
  • 936 Views
శాంసంగ్ గెలాక్సీ ఎస్10ఈ  ఫీచర్లు

న్యూఢిల్లీ: శాంసంగ్ గెలాక్సీ ఎస్ 10లోని అతి చవకైన వేరియంట్ అయిన గెలాక్సీ ఎస్10ఈ స్మార్ట్‌ఫోన్ ఫొటోలు, ఫీచర్లు లీకయ్యాయి. శాంసంగ్ ఈ నెలలోనే ఎస్10 సిరీస్‌ను విడుదల చేయాలని భావిస్తుండగా అంతలోనే ఈ ఫొటోలు లీకై ఫీచర్లు బయటకు వచ్చేశాయి. లీకైన ఫొటోలను బట్టి ఎస్10ఈ వేరియంట్‌లో ఇన్ఫినిటీ-0 డిస్‌ప్లే ప్యానల్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఫింగర్ ప్రింట్ స్కానర్ తదితర ఫీచర్లు ఉన్నట్టు తెలుస్తోంది. జర్మనీకి చెందిన ‘విన్ ఫ్యూచర్’ ఈ ఫొటోలను లీక్ చేసింది. ఫోన్ కుడివైపున పంచ్ హోల్ కెమెరా, వెనకవైపు అడ్డంగా డ్యూయల్ కెమెరా ఉన్నట్టు తెలుస్తోంది. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ ఆప్షన్, 3,100 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ కానరీ యెల్లో, ప్రిస్మ్ బ్లాక్, ప్రిస్మ్ గ్రీన్, పెర్ల్ వైట్ రంగుల్లో రానుంది. ధర దాదాపు రూ.61,200 ఉండే అవకాశం ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos