కోవెలకుంట్ల పట్టణంలో మంచి పట్టు ఉన్న లాయర్‌బాబు (వాసగిరి సాయికృష్ణమూర్తి) బుధవారం వైసీపీని వీడి అధికారికంగా బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఆయనతో పాటు అనుచరులు భారీ సంఖ్యలో కోవెలకుంట్లలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించే సమావేశంలో పార్టీలో చేరనున్నారు. వాసగిరి సాయికృష్ణమూర్తి 1995 నుంచి 2001 వరకు కోవెలకుంట్ల సర్పంచుగా, ఆయన సతీమణి వాసగిరి శోభారాణి 2001 నుంచి 2006 వరకు సర్పంచుగా సేవలందించారు. గత 20 సంవత్సరాలుగా లాయర్‌బాబుకు కోవెలకుంట్ల పట్టణంలో మంచి పట్టు ఉంది. గత ఎన్నికల్లో లాయర్‌బాబు కాటసాని రామిరెడ్డి వర్గంలో ఉన్నారు. 2014 నుంచి 2018 వరకు కోవెలకుంట్ల ఉప సర్పంచుగా లాయర్‌బాబు సేవలందించారు. గత సర్పంచు ఎన్నికల్లో కోవెలకుంట్ల ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో తన మద్దతుదారులను వార్డు మెంబర్లు, సర్పంచును గెలిపించుకొని ఐదేళ్లపాటు ఉప సర్పంచుగా పనిచేశారు. కోవెలకుంట్ల పట్టణంలో ఎమ్మెల్యే బీసీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు లాయర్‌బాబు పేర్కొన్నారు. కోవెలకుంట్ల పట్టణంలో మంచి పట్టు ఉన్న లాయర్‌బాబు చేరికతో టీడీపీ బలం పుంజుకుంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.