వైఎస్సార్‌సీపీలోకి ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి

వైఎస్సార్‌సీపీలోకి ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి

రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి గురువారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి.. సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మేడా మల్లికార్జునరెడ్డితోపాటు ఆయన అనుచరులు, నాలుగు మండలాల నాయకులు కూడా పెద్దసంఖ్యలో వైఎస్సార్‌సీపీలో చేరారు.  లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజంపేట నుంచి వచ్చిన మేడా అనుచరులు భారీగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అవినాశ్‌రెడ్డితోపాటు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు.

గతవారం వైఎస్‌ జగన్‌తో భేటీ!
వైఎస్సార్‌ సీపీ జిల్లా రాజంపేట నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్‌ మేడా మల్లిఖార్జున రెడ్డి గత మంగళవారం వైఎస్‌ జగన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. టీడీపీలో ఇమడలేకపోతున్నానని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతానని ఆయన వైఎస్‌ జగన్‌ను కోరారు. ఎమ్మెల్యే సహా అధికార పదవులన్నింటికీ రాజీనామా చేయాలని ఈ సందర్భంగా ఆయనకు వైఎస్‌ జగన్‌ సూచించారు. తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొని చంద్రబాబు విలువలు దిగజార్చారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు, విశ్వసనీయత ముఖ్యమని పునరుద్ఘాటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos