వేడెక్కిస్తున్న వారియర్ ఫిలిం

  • In Film
  • January 21, 2019
  • 205 Views
వేడెక్కిస్తున్న వారియర్ ఫిలిం

`బాహుబలి` స్ఫూర్తితో అన్ని పరిశ్రమల్లో భారీ మల్టీస్టారర్లు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆ కోవలో కొన్ని వైఫల్యాలు కనిపించినా ప్రయత్నాలు మాత్రం ఆగడం లేదు. అమీర్ – అమితాబ్ ల `థగ్స్ ఆఫ్ హిందూస్తాన్` ఫలితం నిరాశపరిచినా బాలీవుడ్ లోనూ భారీ మల్టీస్టారర్ల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. వీటికోసం అతిభారీ బడ్జెట్లు కేటాయిస్తున్నారు. మలయాళంలోనూ ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ కోవలోనే మోహన్ లాల్ ప్రస్తుతం ఓ భారీ మల్టీస్టారర్ లో నటిస్తున్నారు.

లాల్ ప్రధాన పాత్రలో ప్రియదర్శన్  తెరకెక్కిస్తున్న బహు భాషా చిత్రం `మరక్కార్: అరబికడలింటే సింహమ్` మల్టీస్టారర్ కేటగిరీకే చెందుతుంది. ఈ సినిమా కోసం ఏకంగా 150 కోట్ల బడ్జెట్ కేటాయించారు. యాక్షన్ కింగ్ అర్జున్ సునీల్ శెట్టి ప్రభుదేవా నాగార్జున కీర్తీ సురేశ్ ప్రణవ్ మోహన్ లాల్ కల్యాణి ప్రియదర్శన్ తదితర తారాగణంతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాని అన్ని భాషల్లో రిలీజ్ చేసి భారీగా వసూళ్లు ఆర్జించాలన్నది ప్లాన్.హైదరాబాద్ లో ఓ ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణ సాగుతోందని తెలుస్తోంది. మోహన్ లాల్ సునీల్ శెట్టి ప్రభుదేవా తదితర తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి సునీల్ శెట్టి లుక్ ను రిలీజ్ చేశారు. సునీల్ లుక్ … ట్రాయ్ గ్లాడియేటర్ 300 వంటి హాలీవుడ్ చిత్రాల స్ఫూర్తితో రూపొందించినదిగా కనిపిస్తోంది. సునీల్ ఈ చిత్రంలో ఓ వారియర్ కింగ్ పాత్రలో నటిస్తున్నారట. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జునపై చిత్రీకరణకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos