జమ్ము : జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారితో పాటు అనేక ప్రదేశాలలో మంచు చరియలు విరిగిపడటంతో మంగళవారం రహదారులను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. తీవ్రంగా మంచు కురుస్తుండటంతో పాటు చరియలు విరిగి పడుతుండటంతో గత వారం నుండి రాష్ట్రంలోని పలు జాతీయ రహదారులను మూసివేసిన సంగతి తెలిసిందే. రహదారులపై శిథిలాలను తొలగించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు యత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రహదారిపై అనేక ప్రాంతాలలో విరిగిపడిన మంచుచరియలు తొలగిస్తున్నామని, తాజాగా రామ్‌సు, పన్తియాల్‌లలో సోమవారం అర్థరాత్రి మంచు చరియలు విరిగి పడినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపారు.