సెల్వ రాఘవన్ దర్శకత్వంలో 2004వ సంవత్సరంలో రవికృష్ణ సోనియా అగర్వాల్ జంటగా తెలుగు,తమిళంలో ఒకేసారి తెరకెక్కిన ‘7/జి బృందావన కాలనీ’ తమిళంలో కంటే తెలుగులోనే సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. తెరకెక్కిన ఆ చిత్రం అప్పట్లో యూత్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది.ఇక ఈ చిత్రం బెంగాళి ఒడియా కన్నడ చిత్రాల్లో రీమేక్ అయ్యి అక్కడ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
విడుదలై 15 ఏళ్లు అయిన తర్వాత ఇప్పుడు హిందీలో ఈ చిత్రం రీమేక్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సీరిస్ ఈ చిత్రంను హిందీలో రీమేక్ చేసేందుకు సిద్దం అయ్యింది. బాలీవుడ్ బిగ్గెస్ట్ చిత్రాల దర్శకుడిగా పేరున్న సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని టీ సీరిస్ తో కలిసి నిర్మించనున్నాడు.మంగేష్ హడవలే దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను జరుపుకుంటుంది. జావెద్ జఫ్రీ తనయుడు మజన్ జఫ్రీ ఈ చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. అతి త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడటంతో పాటు షూటింగ్ కార్యక్రమాలు లాంచనంగా ప్రారంభం కాబోతున్నాయి. సంజయ్ లీలా భన్సాలీ హ్యాండ్ పడటంతో ఈ చిత్రంపై బాలీవుడ్ వర్గాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.