విజయవాడ నుంచి కొచ్చికి స్పైస్ జెట్‌

విజయవాడ నుంచి కొచ్చికి స్పైస్ జెట్‌

విజయవాడ : విజయవాడ -కొచ్చి మధ్య నూతన విమాన సేవల్ని స్పైస్‌ జెట్‌ సంస్థ మార్చి 1 నుంచి ఆరంభించనుంది. ప్రస్తుతం  టిక్కెట్టు ధరరూ.4 వేల -రూ.6 వేల వరకు ఉంది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఏటా ప్రయాణికులు భారీ సంఖ్యలో కేరళ విహారయాత్రకు కేరళ వెళుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు వెళ్లి అక్కడి నుంచి  కొచ్చి వెళుతున్నారు. విజయవాడ -కొచ్చి రైలు ప్రయాణ వ్యవధి 18 నుంచి 20 లు. కేవలం మూడు గంటల్లో విమానంలో గమ్య స్థానాన్ని చేరుకోవచ్చు. తిరుపతి మీదుగా కొచ్చికి విమానాల్ని నడుపుతారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos