
దిండివనం: విళ్ళుపురం జిల్లా దిండి వనమ్ వద్ద శనివారం ఉదయం సంభవించిన రహదారి ప్రమాదంలో విళ్లుపురం లోక్‌సభ సభ్యుడు రాజేంద్రన్ మృతి చెందారు. రహదారి డివైడర్‌కు ఏర్పాటు చేసిన బోర్డును ఢీ కొనడంతో కారు నుజ్జు నుజ్జు అయింది. రాజేంద్రన్ ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు పోలీసు వర్గాలు తెలిపారు. అన్నాడీఎంకే అభ్యర్థిగా 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన గెలిచారు. రాజేంద్రన్ మృతి కి అన్నాడీఎంకే దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. ప్రమాదంలో మరి కొందరు కూడా స్వల్పంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.