లోకేష్‌కు చేదు అనుభవం

  • In Local
  • January 11, 2019
  • 1057 Views
లోకేష్‌కు చేదు అనుభవం

తూర్పుగోదావరి : ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు చేదు అనుభవం ఎదురైంది. పెద్దాపురం మండలం కట్టమూరులో శుక్రవారం జరిగిన మంచినీటి పథకం ప్రారంభోత్సవానికి లోకేష్‌ హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. పచ్చనేతలకు అనుకూలమైన వారికే మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నారంటూ మహాలక్ష్మి అనే మహిళ లోకేష్‌ను నిలదీశారు. తాము నివసిస్తున్న ఐదవ డివిజన్‌లో రోడ్డు, మంచినీళ్లు వంటి సౌకర్యాలు లేవంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెతో పాటు పలువురు తమ సమస్యలపై ఆందోళన చేయడంతో లోకేష్‌ అర్థాంతరంగా సభను ముగించుకుని కట్టమూరి నుంచి వెళ్లిపోయారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos