లోకాయుక్త పరిధిలో సీఎం…మహారాష్ట్ర సంచలన నిర్ణయం

లోకాయుక్త పరిధిలో సీఎం…మహారాష్ట్ర  సంచలన నిర్ణయం

ముంబయి : ప్రముఖ సామాజికవేత్త అన్నాహజారే ఒత్తిడికి మహారాష్ట్ర సర్కారు లొంగిపోయింది. లోకాయుక్త పరిధిలో సీఎం ను తీసుకువస్తూ మహారాష్ట్ర సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. అవినీతి విషయంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రిని కూడా రహస్యంగా విచారణ చేసే అధికారాన్ని లోకాయుక్తకు ఇస్తూ దేవేంద్ర ఫఢ్నవీస్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. దీంతో పాటు మహారాష్ట్రలో లోకాయుక్త, ఉప లోకాయుక్తల నియామకంలో పారదర్శక విధానాన్ని అవలభించాలని సర్కారు నిర్ణయించింది. అవినీతి లేని పాలన అందించేందుకు మహారాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయం దోహదపడుతుందని జలవనరుల శాఖ మంత్రి గిరీష్ మహాజన్ చెప్పారు. సీఎంను లోకాయుక్త పరిధిలోకి తీసుకురావాలని అన్నాహజారే గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్న విషయం పాఠకులకు విదితమే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos