ముంబయి: దేశ స్టాక్ మార్కెట్లు బుధవారం
లాభాలతో ఆరంభమయ్యాయి. ఉదయం 9.34 సమయంలో సెన్సెక్స్ 268 పాయింట్ల లాభంతో 36,242 వద్ద, నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 10,892 పాయింట్ల వద్ద ట్రేడ్ అయ్యాయి. అలహాబాద్ బ్యాంక్, ధనలక్ష్మీ బ్యాంక్‌లను ఆర్‌బీఐ.. పీసీఏ నుంచి తొలగించినందున వాటి షేర్లు జోరుగా ట్రేడ య్యాయి. ఇదే బాటలో యస్‌బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, మారుతి, అల్ట్రా టెక్, హెచ్‌పీసీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్ షేర్లు సాగాయి. రూపాయి 4పైసలు లాభంతో
71.11 వద్ద ట్రేడవుతోంది. గత రెండుసెషన్లలో రూపాయి 10 పైసలు నష్టపోయింది. విప్రో, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోతున్నాయి.