న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ నిరాశజనకంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విమర్శించారు. రైతాంగానికి ఆశించిన స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు లేవని అన్నారు. మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని వేతన జీవులకు పన్ను మినహాయింపు ఇవ్వడం మినహా ఏ ఒక్కటీ సంతృప్తికరంగా లేవవన్నారు. ఇన్కమ్ సపోర్ట్ కింద రైతులకు ఏడాదికి రూ.6వేలు కేటాయించడం అంటే కేంద్ర ప్రభుత్వం వారికి నెలకు రూ.500 మాత్రమే లెక్కగట్టారని పేర్కొన్నారు. రైతులు గౌరవప్రదంగా జీవించడానికి ఆ మాత్రం ఆర్థిక సహాయం సరిపోతుందా? అని థరూర్ ప్రశ్నించారు.