వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఓ సీఐ రెచ్చిపోయారు. తన సొంత ఇంట్రస్ట్ తో సివిల్ వివాదాల్లో తల దూర్చాడు. ఇష్టవచ్చినట్లు విచక్షణ రహితంగా ఓ వ్యక్తిని పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. పశువులా ట్రీట్ చేశారు. ఓ కేసు వివాదంలో చిట్‌ఫండ్ బ్రాంచ్ ఉద్యోగి రఘుపతిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించుకోని అతన్ని చితకబాదారు సీఐ సదయ్య.సుమారు రెండు గంటల పాటు రఘుపతిని లాకప్‌లో పశువును కట్టేసినట్టు ఓ మొద్దుకు కట్టేశారు. చిట్‌ఫండ్ వ్యవహారంలో తలదూర్చిన సీఐ.. మార్ట్‌గేజ్ కాగితాలు తిరిగివ్వాలంటూ అచల చిట్‌ఫండ్ యాజమాన్యాన్ని బెదిరించారు. ఫిర్యాదు చేసిన కస్టమర్ లిగల్ గా తమ కంపెనీకి డబ్బు కట్టాల్సి ఉందని చెప్పాడు రఘుపతి. దీంతో సీఐ ఆగ్రహాంతో ఊగిపోయిన సీఐ నానా దుర్బాషలాడాడు…తాము అడిగితే డాక్యుమెంట్స్ ఇవ్వారా అంటూ బెల్ట్ తో కొట్టాడు. రెండు చేతులు కట్టేసి నానా రకాలుగా హింసించారని బాధితుడు వాపోయాడు. అటు సీఐ తీరుపై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశాడు అచల చిట్ ఫండ్ ఎండీ.