రాహుల్ గాంధీకి ఊతకర్ర దొరికింది : బీజేపీ

రాహుల్ గాంధీకి ఊతకర్ర దొరికింది : బీజేపీ

న్యూఢిల్లీ : ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై బీజేపీ స్పందించింది. తూర్పు ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జిగా ప్రియాంక నియమితురాలైన నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిథి సంబిత్ పాత్రా బుధవారం మాట్లాడారు. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం వల్ల ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విఫలమైనట్లు, పార్టీ నైరాశ్యంలో ఉన్నట్లు వెల్లడవుతోందని అన్నారు. ‘‘రాష్ట్రాల్లో మహా కూటమిలో భాగస్వామి అయ్యేందుకు కాంగ్రెస్‌ను అంగీకరించకపోవడంతో, కుటుంబంలో ఓ ఊత కర్ర కోసం అన్వేషణ జరుగుతోంది. ప్రియాంక, ఆయన (రాహుల్ గాంధీ) కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఆమె ఆయనకు ఊత కర్ర వంటివారు’’ అని సంబిత్ పాత్రా అన్నారు. కాంగ్రెస్ ప్రధానంగా, బహిరంగంగా రాహుల్ గాంధీ విఫలమైనట్లు, తమకు కుటుంబం నుంచి ఓ ఊత కర్ర కావాలని ప్రకటించిందన్నారు. బీజేపీకి పార్టీయే కుటుంబమని చెప్పారు. కానీ కాంగ్రెస్‌కు మాత్రం కుటుంబమే పార్టీ అన్నారు. అన్ని ఎంపికలు ఒకే కుటుంబంలో జరుగుతాయని ఆరోపించారు. రాహుల్ గాంధీ విఫలమయ్యారన్నారు. నెహ్రూ, ఇందిర, రాజీవ్, సోనియా, రాహుల్ తర్వాత ఎవరు? కేవలం ఒకే కుటుంబం. తర్వాత ఎవరు? ఈ ప్రశ్నను నవ భారతం అడుగుతోందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos