అహ్మదాబాద్ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి “తీపి” అనుభవం ఎదురైంది. గుజరాత్‌లోని వల్సాద్‌లో గురువారం జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో రాహుల్‌గాంధీ పాల్గొన్నారు. వేదికపై రాహుల్ గాంధీకి పూలమాలలు వేయటానికి వచ్చిన మగువల్లో ఒకరు ఆనందంతో ఆయనకు ముద్దుపెట్టారు. రాహుల్ గాంధీ దీన్ని పెద్దగా పట్టించు కోలేదు. సంబంధిత వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది